అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు
తంగళ్లపల్లి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో కొలువుదీరిన అమ్మవారిని బీఆర్ఎస్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులకు తీర్థప్రసాదాలు అందజేసి అమ్మవారి కండువాలతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కమిటీ సభ్యుల చొరవను నాయకులు అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజయ్య ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజన్న సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య రాష్ట్ర యువజన నాయకుడు జక్కుల నాగరాజు యాదవ్ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి జిల్లా యువజన నాయకుడు మోతె మహేష్ యాదవ్ అమర్ రావు జగన్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ బల్లెపు ప్రశాంత్ పొన్నం శంకర్ తదితరులు పాల్గొన్నారు.