ఎల్ నినో ప్రభావంపై నజర్.. కమిటీలో ఆరుగురు మంత్రులు

19-10-2026 | 04:26pm

ఎల్ నినోపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. భట్టి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ!

హైదరాబాద్: ఎల్ నినో(El Nino) పరిస్థితులను సమీక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana government) మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన ఆదేశాలు, సూచనలు జారీ చేయడం ఈ ఉపసంఘం ప్రధాన బాధ్యతగా ఉండనుంది.

కమిటీలో ఎవరెవరంటే?

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిని ఉపసంఘం సభ్యులుగా నియమించారు. ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరించనున్నారు. ప్రణాళిక శాఖ కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఎప్పటికప్పుడు సమీక్ష.. అవసరమైన సూచనలు

ఎల్ నినో పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులను ఉపసంఘం సమీక్షించనుంది. పరిస్థితులకు అనుగుణంగా సంబంధిత శాఖలకు ఆదేశాలు, సూచనలు అందించనుంది. వాతావరణ పరిణామాలపై ప్రభుత్వ స్థాయిలో సమన్వయంతో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. ఎల్ నినో ప్రభావం వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయ రంగంపై చూపే అవకాశాల నేపథ్యంలో పరిస్థితుల పర్యవేక్షణకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే తెలంగాణపై ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది వాతావరణ శాఖ తాజా అంచనాల ఆధారంగా స్పష్టమవుతుంది.

మరిన్ని వార్తలు