భారత మార్కెట్ లోకి ఎంజీ విండ్సర్ ఇండల్జ్

19-10-2026 | 07:10pm

గురుగ్రామ్, అక్టోబర్, 2026: జెఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎంజీ విండ్సర్ ఇండల్జ్(MG Windsor Indulge) ఎడిషన్ విడుదలను ప్రకటించింది. ఇది భారతదేశపు నంబర్ 1 EV*కి మరింత అద్భుతమైన వెర్షన్. 38-kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ వాహనం 100 kW (136 PS) పవర్ మరియు 200 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని ధృవీకరించబడిన రేంజ్ 332 km#. ఎంజీ విండ్సర్  యొక్క ఫ్యూచరిస్టిక్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్ మరియు ప్రత్యేకమైన బిజినెస్ క్లార్ సౌకర్యాలను మరింత ముందుకు తీసుకెళ్తూ, ఇండల్జ్ ఎడిషన్ ప్రత్యేకతకు కొత్త స్థాయిని అందిస్తుంది.

ఈ స్పెషల్ ఎడిషన్‌లో షాడో గోల్డ్ బాడీ కలర్‌కు సరిపోయే బ్లాక్ రూఫ్‌తో ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ ఉంది. క్యాబిన్‌లో ప్రత్యేకమైన అర్బన్ టాన్ మరియు బ్లాక్ కలర్ అప్హోల్స్టరీ థీమ్‌ను అందించారు. ఇది ప్రీమియం వాతావరణానికి మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని, అధునాతనతను జోడిస్తుంది. ముందు హెడ్‌రెస్ట్‌లపై ప్రత్యేకంగా ఇండల్జ్ ఎంబ్రాయిడరీ చేయబడింది. ఇది ఈ ఎడిషన్ యొక్క ప్రత్యేక గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. బిజినెస్ క్లాస్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్ లో రెండవ వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం ‘ప్రైవ్ స్క్రీన్’ను స్టాండర్డ్‌గా అందించారు. దీని ద్వారా వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు మరింత సౌకర్యం, వినోదం లభిస్తాయి.

ఈ ప్యాకేజ్‌లో ఇండల్జ్ థీమ్‌తో కూడిన కుషన్లు మరియు నెక్ పిల్లోలు కూడా ఉన్నాయి. ఇవి సౌకర్యాన్ని, ప్రత్యేకతను మరింత పెంచుతాయి. స్టైల్ మరియు సౌకర్యంలో మరింత ప్రత్యేకమైన అనుభవాన్ని కోరుకునే కస్టమర్ల కోసం ఎంపిక చేసిన యాక్సెసరీల శ్రేణి కూడా అందుబాటులో ఉంటుంది. దీనితో వారు తమ అభిరుచికి అనుగుణంగా తమ ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ను వ్యక్తిగతీకరించుకోవచ్చు.

వాహన విడుదల సందర్భంగా జెఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా మాట్లాడుతూ, ఎంజీ విండ్సర్ మాకు మాత్రమే కాకుండా ఈవీ విభాగానికి కూడా ఒక ముఖ్యమైన ఉత్పత్తి. ఎందుకంటే ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించడంపై సందిగ్ధతతో ఉన్న అనేక మందిని ఇది ప్రోత్సహించింది. కేవలం 24 నెలల్లోనే 80,000కు పైగా కుటుంబాలకు చేరుకోవడం ఒక విశేషమైన విజయంగా నిలిచింది. విండ్సర్ తన కస్టమర్లకు అందించే విలువకు ఇది నిదర్శనం.

ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఇండల్జ్ ఎడిషన్ ప్రత్యేకమైన మెరుగుదలలు, మెరుగైన క్యాబిన్ అనుభవంతో  విండ్సర్ జీవనశైలికి మరింత ప్రీమియం, వ్యక్తిగతీకరించిన రూపాన్ని కస్టమర్లకు అందిస్తుంది. మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉత్పత్తిని నిరంతరం అభివృద్ధి చేయాలనే మా నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, విండ్సర్ ఈవీ విభాగంలో కస్టమర్లకు ఇష్టమైన ఎంపికగా నిలిపిన ప్రత్యేకతలను కూడా కొనసాగిస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు