దుర్గా పూజా వేడుకల్లో మాజా ‘ఆమంత్రోన్’ స్పూర్తి

19-10-2026 | 07:12pm

కోల్‌కతా, అక్టోబర్ 2026: ఈ పూజా వేడుకల సందర్భంగా, భారతదేశపు ప్రముఖ మామిడి పానీయమైన ‘మాజా(Maaza)’, బెంగాలీ సంప్రదాయమైన ‘ఆమంత్రోన్‌’ (ఆహ్వానం) స్ఫూర్తిని ‘మాజా ఆమంత్రోన్‌’ కార్యక్రమం ద్వారా తీసుకొస్తోంది. శుభకార్యాల సమయంలో బెంగాలీ ఇళ్ల గుమ్మాలను అలంకరించే సాంప్రదాయ మామిడి ఆకుల తోరణాల నుంచి ఈ కార్యక్రమం స్ఫూర్తి పొందింది.

దుర్గా పూజా వేడుకల మధ్య ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అలంకరణ, ఇంటికి తిరిగి రావడంలోని ఆనందాన్ని, ఆత్మీయంగా ఆహ్వానించి స్వాగతించే బెంగాలీ ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. బెంగాలీ కుటుంబాల్లో మామిడి ఆకులతో తయారు చేసే ‘ఆమ్ర పల్లవ్’ తోరణం శుభారంభానికి, ఇంటికి వచ్చే అతిథులకు ఆత్మీయ స్వాగతం పలకడానికి చిహ్నంగా నిలుస్తుంది. ఈ సంప్రదాయం నుంచి స్ఫూర్తి పొందిన మాజా, సాంప్రదాయ తోరణాన్ని ప్రత్యేకమైన పండుగ ముఖద్వారంగా రూపొందిస్తోంది. తద్వారా బెంగాల్‌ సంస్కృతిలో భాగమైన ఈ ఆచారాన్ని తన మామిడి పండ్ల గుర్తింపుతో మిళితం చేస్తోంది.

‘మాజా ఆమంత్రోన్‌’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 20 వరకు దమ్ దమ్ తరుణ్ దళ్ వద్ద సందర్శకులు ఈ ప్రత్యేక అలంకరణను వీక్షించి, ఆ అనుభూతిని ఆస్వాదించవచ్చు. సాంప్రదాయ మామిడి ఆకుల తోరణాన్ని బహిరంగ వేడుకలో భాగంగా పరిచయం చేస్తూ, సుపరిచితమైన బెంగాలీ ఆచారాన్ని సరికొత్త వాతావరణంలో అనుభవించే అవకాశాన్ని ఈ కార్యక్రమం సందర్శకులకు అందిస్తుంది. ఈ కార్యక్రమం పండుగ అలంకరణలోనూ పర్యావరణ స్పృహకు ప్రాధాన్యతనిస్తోంది. ‘మాజా’ తన తోరణాల తయారీకి కంపోస్టింగ్‌కు అనువైన పదార్థాలను ఉపయోగిస్తోంది.

దీంతో బెంగాల్ సంప్రదాయాలను వేడుకగా జరుపుకుంటూనే, పండుగ వేడుకలకే పరిమితం కాకుండా సుస్థిరతకు కూడా ప్రాధాన్యతనిచ్చేలా ఈ ప్రత్యేక అలంకరణను రూపొందించింది. శ్రీమతి సునైనికా సింగ్, సీనియర్ డైరెక్టర్, మార్కెటింగ్ - న్యూట్రిషన్, కోకా-కోలా ఇండియా మరియు సౌత్‌వెస్ట్ ఆసియా మాట్లాడుతూ, “దుర్గా పూజ అంటే స్వస్థలాలకు తిరిగి రావడం, సామూహిక ఐక్యత, బెంగాల్‌ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా ఆహ్వానించే సంప్రదాయాన్ని గుర్తుచేసే వేడుక. మామిడి ఆకుల తోరణం ఈ స్ఫూర్తికి అందమైన ప్రతీక.

ఇది శుభారంభానికి చిహ్నంగా నిలుస్తూ, ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతుంది. ‘మాజా ఆమోన్‌ట్రాన్‌’ ద్వారా ఈ సుపరిచితమైన సంప్రదాయాన్ని దుర్గా పూజ వేడుకల్లో మరింత విస్తృతంగా భాగం చేయాలని మేము కోరుకున్నాం. అదే సమయంలో, వేడుకలు ముగిసిన తర్వాత కూడా ఇన్‌స్టాలేషన్‌ పర్యావరణంపై చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, సుస్థిరమైన పదార్థాల వినియోగం ద్వారా పండుగ అనుభవాన్ని మరింత బాధ్యతాయుతంగా ఎలా తీర్చిదిద్దవచ్చో కూడా పరిశీలించామన్నారు. ఈ ఆహ్వాన స్ఫూర్తిని ఇన్‌స్టాలేషన్‌కే పరిమితం చేయకుండా, ‘మాజా’ పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా ఉన్న పాఠకులకు చేరువయ్యేలా ప్రముఖ ప్రాంతీయ వార్తాపత్రికలో పూర్తి పేజీ ఆహ్వానాన్ని ప్రచురిస్తోంది. తద్వారా వారిని దుర్గా పూజ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది.

మరిన్ని వార్తలు