జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐజేయు కృషి

19-10-2026 | 07:25pm

ఐజేయు ప్రధాన కార్యదర్శి సోమ సుందర్

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్(ఐజేయు) సెక్రెటరీ జనరల్ సోమ సుందర్(IJU Secretary General Soma Sundar) అన్నారు. సోమ వారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖతో కలిసి ఆయన మాట్లాడారు.

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రొటెస్టుకు సంబంధించిన వార్త కవరేజీకి వెళ్తే పోలీసులు జర్నలిస్టులపై అమానుషంగా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. నిరసనకారులను ఏ విధంగా పోలీసులు ట్రీట్ చేస్తారో జర్నలిస్టులను అదే విధంగా చూడడం సరైన పద్ధతి కాదన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులను నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహారించుకోవాలని, వాటి వలన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులు అందరికీ ఉచితంగా వైద్యం అందించడానికి హెల్త్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు కేశెట్టి వంశీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి పింగిళి, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ రాజు, ఎర్రం ప్రభాకర్, కాచం సతీష్, బిరుదుల దేవరాజ్, చొక్కారపు శ్రీనివాస్, శ్రీధర్, తిరుపతి, రాజేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు