ఆంపియర్ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్
నల్గొండ అక్టోబర్ 2026: ఆంపియర్(Ampere) ఈరోజు హైదరాబాద్ రోడ్ వద్ద ఎస్ఎన్ మోటార్స్ ను ప్రారంభించడం ద్వారా నల్గొండలో తమ వాణిజ్య, సేవా కార్యకలాపాలను మరింత విస్తృతం చేసింది. ఈ కొత్త ఆంపియర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, వినియోగదారులకు ఒకే చోట సమగ్రమైన అమ్మకాలు, సేవా అనుభవాన్ని అందించనుంది. తద్వారా ఈ ప్రాంత వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు వాటిని మరింత చేరువ చేయనుంది.
ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్, విభిన్న రకాల మొబిలిటీ అవసరాలు , వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను ప్రదర్శిస్తుంది. దీనిలో మాగ్నస్ జీమాక్స్, మాగ్నస్ నియో వంటివి ఉన్నాయి. ఈ పోర్ట్‌ఫోలియోకు ప్రధాన ఆకర్షణగా ఆంపియర్ నెక్సస్ EX+ నిలుస్తుంది. ఇది కొత్త 5 kW శక్తివంతమైన మోటర్‌తో వస్తుంది. భారతదేశంలోని అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో తన పనితీరును ప్రదర్శిస్తూ అనేక జాతీయ, అంతర్జాతీయ రికార్డులను నెలకొల్పింది.
కుటుంబాలు, డబ్బుకు తగ్గ విలువను కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించిన మాగ్నస్ జీమాక్స్ రోజువారీ అవసరాలకు అనుగుణమైన సౌలభ్యం, కనెక్టెడ్ టెక్నాలజీ, అందుబాటు ధరలను సమన్వయం చేస్తుంది. అదే సమయంలో, నగరంలో సౌకర్యవంతమైన రోజువారీ సవారీపై దృష్టి సారించి మాగ్నస్ నియో రూపొందించబడింది. ఇటీవల విడుదల చేసిన ఆంపియర్ రియో వైబ్‌తో విద్యార్థులు, కళాశాలలకు వెళ్లే యువత సహా యువ రైడర్లకు కూడా తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది.
ఆధునిక, ఇంటరాక్టివ్ రిటైల్ కేంద్రంగా రూపొందించబడిన ఈ కొత్త ఆంపియర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి, సమాచారంతో కూడిన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రధాన మార్కెట్లలో ఆంపియర్ వాణిజ్య ,సేవా కార్యకలాపాలను విస్తరించడానికి, కస్టమర్లకు మరింత చేరువ చేయడానికి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చేస్తున్న నిరంతర ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త డీలర్‌షిప్ ప్రారంభించబడింది. నల్గొండలో ఈ తాజా ప్రారంభం, ఎలక్ట్రిక్ మొబిలిటీ మరింతగా అందుబాటులోకి తీసుకురావటానికి మరో ముందడుగును సూచిస్తుంది.