పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు

19-10-2026 | 07:06pm

ఆరుగురు అరెస్ట్‌

మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) మందమర్రి శివారులో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న స్థావరంపై సోమ వారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఆరుగురితో పాటు నగదు, సెల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో నార్కోటిక్ టీమ్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఆరుగురి (వడ్డే కుమార్, దురిశెట్టి శ్రీనివాస్, కర్ణ వెంకటేష్, సల్లు సతీష్, సల్ల సాధానందం, కొట్టే కిషోర్) ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 86,230 నగదుతో పాటు ఆరు సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకొని మందమర్రి పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు