NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): ప్రభుత్వం NHM ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి(BJP State Vice President Raghunath Verabelli) కోరారు. NHM ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్షకు బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో NHM ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పార్టీ NHM ఉద్యోగులను అండగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో పూర్తిగా సమయానికి చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాట నిధులు చెల్లించడంలో జాప్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బేర సత్యనారాయణ, నాయకులు కుర్రె చక్రి, అమిరిశెట్టి రాజ్ కుమార్, పల్లి రాకేష్, ఈర్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.