మాసాయిపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
బిజెపి మండల అధ్యక్షుడు మోలుగు నాగేందర్ రెడ్డి
చేగుంట నవంబర్ 4 (విజయక్రాంతి): మెదక్ జిల్లా మాసాయిపేట మండలాన్ని(Masaipet Mandal) కరవు మండలంగా ఎందుకు ప్రకటించలేదని బిజెపి మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. ఎలినినో కారణంగా మండలంలో చెరువులు కుంటలు నిండక రైతులు చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా ఈ వర్షాకాలం పంటలు కూడా, దిగుబడులు తగ్గడం, పెట్టుబడి ఖర్చులు పెరగడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, అర్హులైన రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ బీజేవైఎం మండల అధ్యక్షుడు గోగొండ విట్టల్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు పాల్గొన్నారు.