పంటపొలాలను పరిశీలించిన ఏ.ఓ
04-11-2026 | 11:15pm
ములకలపల్లి (విజయక్రాంతి): తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలను బుధవారం మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు(Mandal Agricultural Officer Arun Babu), వ్యవసాయ శాఖ సిబ్బంది పరిశీలించారు. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు మండలంలో వరి - 1850 ఎకరాలు, ప్రత్తి - 1500 ఎకరాలు, వేరుశనగ - 160 ఎకరాలు, మినుములు- 25 ఎకరాలలో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. గురువారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలిస్తారు.రైతులు ఎవరు కంగారు పడకుండా, ఎవరైనా పంట నష్టం జరిగిందనుకుంటే తమ దగ్గరలోని వ్యవసాయ విస్తరణ అధికారికి తెలియజేయగలరని ఆయన రైతులకు సూచించారు.