రాజ్యాధికారమే లక్ష్యంగా మాదిగలంతా ఏకం కావాలి
మాదిగల ఓట్లు మాదిగలకే వేసుకుంటే రాజ్యాధికారం సాధ్యం
మంథనిలో మాదిగల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనం..
మంథని, నవంబర్ 04 (విజయక్రాంతి): రాజ్యాధికారమే లక్ష్యంగా మాదిగలంతా ఐక్యంగా ముందుకు సాగాలని మాదిగల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు మాదిగ బిడ్డల ప్రాతినిధ్యం పెరగాలంటే ఐక్యతతో ఉద్యమించాలని పేర్కొన్నారు.
మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల(Government Boys Junior College) మైదానంలో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా 'మాదిగల ఓట్లు మాదిగలకే', 'జై మాదిగ.. జై జై మాదిగ' అంటూ నినాదాలు చేశారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా మాతా శిశు ఆసుపత్రి పక్కన ఉన్న బీఎస్ బాంక్వెట్ హాల్‌కు చేరుకుని ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు చట్టసభల్లో మాదిగ బిడ్డల గెలుపే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగేలా ఉద్యమించాలని, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. మంథని డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల నుంచి వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఐక్యవేదిక ఇచ్చే ప్రతి పిలుపునకు మాదిగలంతా సంఘటితంగా తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాదిగల ఐక్యవేదిక నాయకులు వేల్పుల రాజు, బూడిద తిరుపతి, మంథని రాకేష్, ఇందారపు నవీన్, కన్నూరి రాజు, బాపు, కొయ్యల మొండి, కన్నూరి బాపు, తోకల మల్లేష్, నాగేల్లి మహేష్, దూడపాక శ్రీధర్, వేల్పుల శ్రావణ్, కొయ్యల దేవేందర్, పోయిల సుమన్, కడారి సంజయ్, వేల్పుల సత్యం, బూడిద రమేష్, వేల్పుల సామ్రాట్, రాజయ్య, కాసిపేట రమేష్, కాసిపేట సాగర్, కమాన్‌పూర్, ముత్తారం మండలాలకు చెందిన న్యాయవాదులు ఇరుగురాల సంతోష్, పారునంది సురేందర్, ఇనుముల ప్రదీప్, మంథని లింగయ్య, కొయ్యల రాయమల్లు, కాసిపేట పోశం, వేల్పుల శ్రీకాంత్, పోయిల తిరుపతి, విరుగురాల ప్రసాద్ తదితరులతో పాటు వివిధ గ్రామాల మాదిగ నాయకులు పాల్గొన్నారు.