అన్ని మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

04-11-2026 | 11:10pm

* బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి..

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి(BRS youth leader Dr Nagam Shashidhar Reddy) డిమాండ్ చేశారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం కరువు మండలాల ఎంపికకు అనుసరించిన ప్రాతిపదికను వెల్లడించాలని కోరారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలని, కల్తీ విత్తనాల విక్రేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. డిండి ప్రాజెక్టును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు