మళ్లీ పెరిగిన బంగారంధరలు
బంగారం కొనాలనుకుంటున్న వారికి మళ్లీ షాక్ తగిలింది. గతవారం వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు (Gold Prices) ఈ వారం ప్రారంభంలోనే ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో మార్కెట్లో పసిడికి డిమాండ్ (Demand) పెరిగి ధరలు పరుగులు పెడుతున్నాయి. నవంబర్ 23, సోమవారం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1,480 పెరగడం గమనార్హం.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,480 పెరిగి రూ.1,26,560కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,350 పెరిగి రూ.1,16,000 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,100 పెరిగి రూ.94,910కు చేరింది. ఒక్కరోజులోనే ఇంత భారీ పెరుగుదల నమోదవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
గ్రాముల వారీగా చూస్తే 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.148 పెరిగి రూ.12,656కు చేరింది. 22 క్యారెట్ల గ్రాము ధర రూ.135 పెరిగి రూ.11,600గా నమోదైంది. 18 క్యారెట్ల గ్రాము ధర రూ.110 పెరిగి రూ.9,491కు చేరుకుంది. ఇక 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.14,800 పెరిగి రూ.12,65,600కు చేరింది. 22 క్యారెట్ల 100 గ్రాముల ధర రూ.13,500 పెరిగి రూ.11,60,000గా నమోదైంది. 18 క్యారెట్ల 100 గ్రాముల ధర రూ.11,000 పెరిగి రూ.9,49,100కు చేరింది.
గతవారం ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలుకు సిద్ధమైన వారికి తాజా పెరుగుదల నిరాశ కలిగిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌తో పాటు శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలనుకునే వారు ధరల కదలికలను గమనిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడుల ప్రవాహం బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో పసిడి మరింత పైకి వెళ్తుందా? లేక మళ్లీ తగ్గుతుందా? అన్నది వేచి చూడాలి.