పాలెంలో యువతి అదృశ్యం

09-11-2026 | 10:00pm

బిజినేపల్లి:  మండలంలోని పాలెం గ్రామానికి(Palem village) చెందిన యువతి అదృశ్యమైన ఘటనపై ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై శంషూద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం పాలెం గ్రామానికి చెందిన యువతి జిల్లా కేంద్రంలోని ఒక వస్త్ర దుఖాణం పని చేస్తోందని, నవంబర్ 8వ తేదీన రోజూ మాదిరిగానే ఇంటి నుంచి వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగి రాలేదన్నారు. చుట్టు పక్కల బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని, తమ  బంధువైన వట్టేపు లడ్డూ తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు