భూసార పరిరక్షణ కు రైతులు మట్టి నమూనాను అందజేయాలి

03-11-2026 | 05:46pm

సుల్తానాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి పైడితల్లి 

సుల్తానాబాద్, నవంబర్ 03 (విజయ క్రాంతి): భూసార పరిరక్షణ కొరకు రైతులు మట్టి నమూనాను సేకరించి వ్యవసాయ శాఖ(Department of Agriculture) కు ఇచ్చినట్లయితే ల్యాబ్ కు పంపించి ఫలితాలను రైతులకు అందజేస్తామని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి పైడితల్లి అన్నారు , మంగళవారంమండలంలోని గర్రెపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా పైడితల్లి  మాట్లాడుతూ  ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గత సీజన్ లో సేకరించిన మట్టి నమూనా ఫలితాలను రైతులకు అందజేస్తూ, ఫలితాల  ఆధారంగా సిఫారసు చేయబడిన ఎరువులు వాడాలని రైతులకు సూచించారు.తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం పెద్దపల్లి నుండి శాస్త్రవేత్త డా. ఓదెల సంపత్  ఈ కార్యక్రమానికి హాజరై రైతులకు పలు  సూచనలు చేశారు.

(ఎల్నినో ) విపత్తు వర్షభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న  వంటి పంటలు వేసుకోవాలని  రైతులకు(Farmers) తెలియజేయడం జరిగింది, అలాగే  వరి కొయ్యకాలు(Paddy stubble) కలబెట్టకుండా తిరిగి భూమిలో కలియ దున్నుకోవాలనివివరించారు.ఈ కార్యక్రమంలో మండల  గర్రెపల్లి  ఏఈఓ  ఆనందరావు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు