ఇంటర్మీడియట్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించాలి

03-11-2026 | 07:20pm
  1. ఉత్తమ విద్యార్థినీ, విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
  2. బాల్యవివాహాలు, మాదకద్రవ్యాల నివారణ, మైనర్ డ్రైవింగ్, సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలి

మహబూబాబాద్, (విజయక్రాంతి):జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(District Collector Sneha Sabarish) ఇంటర్మీడియట్, వొకేషనల్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు, సంక్షేమం, వారి సమగ్ర అభివృద్ధిపై మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదర్, పది జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇంటర్మీడియట్, వొకేషనల్ కళాశాలల్లో చదివే విద్యార్థుల హాజరు శాతాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వొకేషనల్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలు అందించడంతో పాటు,

భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యమైన శిక్షణ అందించాలని స్పష్టం చేశారు.కళాశాల ప్రాంగణాల్లో మరియు యువతలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి అధికారులు, యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

బాల్యవివాహాల నిర్మూలన,ఇంటర్మీడియట్ వయస్సు గల బాలికలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన బాల్యవివాహాలను నిరోధించడానికి సమాజం, విద్యాశాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కళాశాలల్లో మౌలిక వసతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, హాస్టళ్ల సౌకర్యాలు మరియు విద్యార్థుల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించేందుకు గాను అన్ని వసతి గృహాల్లో అమల్లోకి తీసుకువచ్చిన ‘కామన్ డైట్ మెనూ’ పై నమూనా పత్రికా ప్రకటన ప్రభుత్వ వసతి గృహాల్లో ‘కామన్ డైట్ మెనూ’ అమలు విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహార పంపిణీ చేయాలని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఒకే రకమైన, నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో కొత్త ‘కామన్ డైట్ మెనూ’ (ఉమ్మడి ఆహార పట్టిక) ను కచ్చితంగా అమలు చేయాలన్నారు.

కామన్ డైట్ మెనూ ముఖ్యాంశాలు

పౌష్టికాహార ప్రమాణాలు,విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన క్యాలరీలు, ప్రొటీన్లు లభించేలా నిపుణుల సలహాతో ఈ ఆహార పట్టికను రూపొందించడం జరిగిందన్నారు. వారంలో ప్రత్యేక ఆహారం ప్రతిరోజూ ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో రుచికరమైన భోజనం అందిస్తారు.

వారంలో నిర్ణీత రోజుల్లో గుడ్లు, చికెన్/ప్రత్యేక భోజనం, పండ్లు అందించాలని, కామన్ డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన సరుకులను మాత్రమే ఉపయోగించాలని, వంట గదులు, భోజన శాలలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రత్యేక అధికారులను ,ప్రిన్సిపళ్లను, హాస్టల్ వార్డెన్లను ఆదేశించారు. డైట్ మెనూ పక్కాగా అమలు జరిగేలా చూసేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

మెనూలో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నా లేదా నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని , డైట్ మెనూ ఫోటోలను తెప్పించి గ్రూప్లో షేర్ చేయాలని ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, హెచ్చరించారు.

వసతి గృహాల్లోని విద్యార్థులందరూ ఈ కామన్ డైట్ సదుపాయాన్ని వినియోగించుకుని, ఆరోగ్యంగా ఉంటూ చదువులో ప్రతిభ కనబరిచే విధంగా విద్యార్థులను చైతన్యపరచాలన్నారు, విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక తరగతుల నిర్వహణ సిలబస్ పూర్తి చేయడం మరియు విద్యార్థులు వార్షిక / ఇంటర్ బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు