డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం 108 రోజుల కార్యాచరణ
- ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణే ధ్యేయం.
- మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్.
- జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై అఖిలపక్ష సమావేశం.
జవహర్ నగర్, నవంబర్ 3 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డంపింగ్ (Jawahar Nagar Dumping)సమస్య పరిష్కారం కోసం 108 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించామని ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణే ద్యేయంగా పనిచేస్తామని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుండి వెలబడుతున్న దుర్వాసన పర్యావరణ కాలుష్యం ప్రజారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించడమే లక్ష్యంగా మంగళవారం నాగారం ఎం వై ఆర్ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి పలు పార్టీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని వేలాది మంది ప్రజల జీవనానికి ఆరోగ్యానికి సంబంధించిన కీలకమైన ప్రజా సమస్య అని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు.
ఐక్య పోరాటమే ఉత్తమం
డంపింగ్ సమస్యపై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని పార్టీల ప్రతినిధులు నేతలు అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఉద్యమం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్ కార్యాచరణ
డంపింగ్ సమస్యపై డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న పరిసరాల దుస్థితి ప్రజల జీవన విధానంపై అధిష్టానానికి తెలిసే విధంగా డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం 108 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి దశలవారీగా పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతిపాదించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్థానిక ప్రజలను సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ ధ్యేయం
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను జాతీయస్థాయి దృష్టిలో తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు ఐక్యంగా కలిసి ముందుకు సాగాలని తద్వారా ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించే దిశగా పార్టీలకతీతంగా ఐక్యంగా పోరాటం కొనసాగించాలని ఈ సమావేశంలో మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, సిపిఐ మాస్ లైన్ గడ్డం సదానందం, సిపిఎం సత్యం, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ దమ్మాయిగూడ జేఏసీ చైర్మన్ శంకర్ నాయక్, జవహర్ నగర్ జేఏసీ కన్వీనర్ షేక్షావలి, జేఏసీ నాయకులు సమ్మిరెడ్డి, సంజీవరెడ్డి స్వర్ణ కేపీ చారి తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు మేక లలిత యాదవ్,
దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షులు రామారావు, జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షురాలు మాజీ మేయర్ శాంతి కొటేష్ గౌడ్, చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, కీసర డివిజన్ అధ్యక్షుడు స్వప్న విజయ్ బి ఆర్ఎస్ మాజీ చైర్మన్ ప్రణీత, జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, నాగారం మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ జవహర్ నగర్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు కొండలు ముదిరాజ్,
దమ్మాయిగూడ టిడిపి అధ్యక్షులు కృష్ణారావు, డిసిసి సెక్రటరీ హరిబాబు, శ్రీకాంత్ రెడ్డి సదానంద సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కారంగుల శంకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు యాదగిరి గౌడ్ వెంకటరెడ్డి రమేష్ హరి గౌడ్, శ్రీహరి గౌడ్ జేఏసీ నాయకులు అఖిలపక్ష నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.