మురుగు నీరు నిల్వ తరలింపునకు చర్యలు

03-11-2026 | 07:31pm

వెల్దండ నవంబర్ 03(విజయక్రాంతి): పాఠశాల ఆవరణలో మరుగునీరు చేరి దుర్వాసన దోమలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు(Students of the Kasturba Gandhi Balika Vidyalaya) అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో స్లోచిన గ్రామ సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్,

అధికారులతో కలిసి వచ్చి పరిశీలించి సమస్యను తెలుసుకున్నారు. మురుగునీరు తరలించడానికి భూగర్భ మార్గం ద్వారా డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడతామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి ఎంపీ ఓ లింగయ్య, కార్యదర్శి గిరి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు