గణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
03-11-2026 | 07:33pm
గణపురం, నవంబర్ 03 (విజయక్రాంతి): మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా గణపురం మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని మాజీ పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి(Former PACS Chairman Poreddy Poornachandra Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురవక పంటల సాగు ఆశించిన స్థాయిలో లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించి, రైతులకు నష్టపరిహారం, అవసరమైన సహాయం అందించాలని కోరారు. కరువు మండలంగా ప్రకటించడంలో జాప్యం చేస్తే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.