తంగళ్లపల్లి పరిధిలో ఎల్సీడీసీ సర్వే తనిఖీ
కుష్టు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి: రాష్ట్ర పరిశీలకులు
తంగళ్లపల్లి, నవంబర్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district)లో నిర్వహిస్తున్న ఎల్సీడీసీ కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ లత, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రామ్ రెడ్డి తంగళ్లపల్లి పీహెచ్సీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రారంభ దశలోనే చికిత్స అందిస్తే అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ దేవ్ సింగ్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.