నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు సన్మానం
కొత్తపల్లి, నవంబర్ 03(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవా సంఘం(Telangana Nai Brahmana Seva Sangham) కరీంనగర్ కమిటీ సభ్యులు మంగళవారం రోజున బిజెపి రాష్ట్రాధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం తీగలగుట్టపల్లి లోని నగర నాయీబ్రాహ్మణ కళ్యాణ మండపం నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయని, కళ్యాణ మండపం పూర్తయ్యేలా నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నాయీబ్రాహ్మణ సంఘానికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లవేళలా మద్దతుగా ఉంటానన్నారు. కళ్యాణ మండపానికి నిధులు మంజూరయ్యేలా చేసి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు ను నూతన నాయీబ్రాహ్మణ కమిటీ సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, గౌరవ అధ్యక్షులు, కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, నీలం మొండయ్య, సంజీవ్ కుమార్ జంపాల సంపత్, వగడాల జయరాం, లక్ష్మణ్ కుమార్ గడ్డం మోహన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.