వేతనాలు ఇప్పించాలని తహసీల్దార్ కు వినతి

03-11-2026 | 06:45pm

​సాలూర, అక్టోబర్ 03 (విజయక్రాంతి): ​సాలూర మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల(PM Shri ZP High School)లో ​ఒకేషనల్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతికి నిబద్ధతతో సేవలు అందిస్తున్నప్పటికీ, గత ఐదు నెలలుగా​ తమకు వేతనాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ​

నెలవారీ వేతనాలు నిలిచిపోవడంతో కుటుంబ పోషణ, ఇళ్ల ఖర్చులు, వైద్య అవసరాలు తీర్చుకోవడం తలకు మించిన భారంగా మారిందని వాపోయారు. ఈ సమస్యపై సాలూర ​ తహశీల్దార్‌ ఆజ్మత్ నవాజ్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ​తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలను ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ఉపా​ధ్యాయులు మెడి రవి, జాదవ్ అక్షయ్​, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు