ఎండిపోయిన వరి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి
మహమ్మదాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
నవంబర్ 3 విజయక్రాంతి: మండల పరిధిలోని చౌదర్‌పల్లి పెద్ద తండా గ్రామపంచాయతీలో (Village Panchayat)ఎండిపోయిన వరి పంటలను మండల వ్యవసాయ అధికారి నరేందర్(Agriculture Officer Narender),ఏఈవోలు నిఖిత,రక్షిత సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రాకేష్, రాజు,మేట్ రామచందర్, లోకేష్ లు మాట్లాడుతూ.. ఎండిపోయిన వరి పంటలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మహమ్మదాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.