తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి
03-11-2026 | 07:11pm
బోథ్. నవంబర్ 3 (విజయక్రాంతి): వేసవికాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా గ్రామాల కార్యదర్శులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) గ్రామాల కార్యదర్శిలను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం గ్రామాల కార్యదర్శిలు ఉపాధి హామీ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం ఇందిరమ్మ మొదటి విడత ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. 40 మంది కూలీలకు ఒక మెట్ ను నియమించాలని సూచించారు. ఇప్పటినుండి మంచినీటి వనరుల పైన దృష్టి సారించాలని కార్యదర్శులను ఆదేశించారు.