జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వార్షిక మహాజన సభకు హాజరైన సొసైటీ చైర్మన్లు
నాగిరెడ్డిపేట్, నవంబర్ 3 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(Nizamabad Cooperative Bank) 104వ వార్షిక మహాజన సభ నిర్వహించడంతో ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ హాజరయ్యారు. సొసైటీ నామినేటెడ్ పదవులు పొందిన సందర్భంగా 104వా వార్షిక మహాజన ఏర్పాటు చేశారు.
దాంట్లో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ కిచన్నపేట,సొసైటీ చైర్మన్ బొగుడమిది శ్రీధర్ గౌడ్, మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ కళాలి సురేందర్ గౌడ్, లింగంపేట్, ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. సొసైటీ నామినేటెడ్ పదవులు పొందిన అనంతరం మొదటిసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సొసైటీ అధ్యక్షులు 104వ వార్షిక మహాజన సభ హాజరై అధికారులతో పరిచయాలు ఏర్పాటుచేసుకొని సొసైటీల అభివృద్ధి,రైతులకు అందించవలసిన సంక్షేమ పథకాల గురించి చర్చించినట్లు సొసైటీ చైర్మన్లు తెలిపారు.