జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా
బోధన్,(విజయ క్రాంతి): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత తెలిపారు. హైదరాబాద్లోని ఓ షాపింగ్ మాల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
నిజామాబాద్ నగరంలోని ఐటీఐ ప్రాంతంలో గల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోతో నిర్ణీత సమయానికి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి చేరుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత కోరారు.