మేడిపల్లిలో ఘనంగా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం

26-10-2026 | 08:45pm

హర్యానా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన

మేడిపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ మేడిపల్లిలో సోమవారం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’(Ek Bharat Shreshtha Bharat) కార్యక్రమాన్ని, హర్యానా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎల్. సత్య ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేకతలను విద్యార్థులకు పరిచయం చేశారు.

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం ద్వారా జాతీయ సమైక్యత, సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించుకోవచ్చని కార్యక్రమం ద్వారా వివరించారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించగా, విద్యార్థులు కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా, ఆనందంగా వీక్షించారు. వివిధ రాష్ట్రాల సంస్కృతుల పట్ల అవగాహన పెంపొందించుకుంటూ, భారతదేశ గొప్పతనo, విద్యార్థుల్లో జాతీయ సమైక్యతా భావాన్ని, దేశంలోని విభిన్న సంస్కృతుల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

మరిన్ని వార్తలు