కాంగ్రెస్ పార్టీలో చేరిన మాదిగ సంఘ సభ్యులు...

26-10-2026 | 08:42pm

తాడ్వాయి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన మాదిగ మహా సంఘం సభ్యులు(Madiga Maha Sangam Members) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుండడంతో తాము ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ సంతాజి గారి సుధాకర్ రావు, నందివాడ గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య,గ్రామపార్టీ అధ్యక్షులు బాల సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు