పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన

26-10-2026 | 07:08pm

నిర్మల్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిర్మల్‌ రూరల్‌ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో సైబర్‌ క్రైమ్‌, నషా ముక్త్‌ భారత్‌(Nasha Mukt Bharat) అంశాలపై పోటీలు నిర్వహించి, విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. సమాజంలో నేరాల నివారణకు యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ, ఏఎస్సై దేవేందర్‌ గౌడ్‌, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు