డిమాండ్లను పరిష్కరించాలని వినతి
26-10-2026 | 07:42pm
నిర్మల్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్(National Health Mission) విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో అతను కలెక్టర్ రమేష్ రాథోడ్ కు వినతిపత్రం అందించారు. ఉద్యోగులు నిరవధిక సమ్మె 14వ రోజులుగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మాకు సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని మహిళలకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు కోరారు ఈ కార్యక్రమంలో రమణ నారాయణ శోభ తదితరులు ఉన్నారు.