దుర్గామాత మండపంలో కుంకుమార్చన
17-10-2026 | 07:45pm
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని దుర్గామాత మండపాల వద్ద శనివారం కుంకుమార్చన నిర్వహించారు. పట్టణంలోని నంది గుండం దుర్గామాత ఆలయంలో నిర్వహించిన పూజలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కలు తెలుసుకున్నారు. గ్రామాల నుంచి పట్టణాల నుంచి పాదయాత్రగా భక్తులు తరలివచ్చారు. పట్టణంలోని బాగులవాడ రామ్ నగర్ సోఫీ నగర్ కాలనీలో మండపాల వద్ద కుంకుమార్చన పూజ యజ్ఞం నిర్వహించారు భక్తులకు అన్నదానం చేపట్టారు.