ప్రభుత్వం ఆదుకోవాలి

25-09-2026 | 02:06pm

ఎలుగుబంటి దాడిలో బాధితుని వేడుకోలు

ఖానాపూర్ (విజయక్రాంతి): నిరుపేదనైన తనను ప్రభుత్వం అటవీ శాఖ ఆదుకోవాలని పంద్రం లక్ష్మణ్ వేడుకుంటున్నారు. ఈనెల 22వ తేదీన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గంగాయపేట అటవీ ప్రాంతం(Gangayapet forest area)లో తనపై ఆడ ఎలుగుబంటి దాడి(bear attack) చేసి గాయపరచగా తీవ్ర గాయాల పాలై ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా తాను గొర్రెలు కాస్తూ అడవి ప్రాంతంలోకి వెళ్ళగా పిల్లలతో ఉన్న ఎలుగుబంటి తనపై తీవ్రంగా దాడి చేసిందని అప్పటి నుంచి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నానని లక్ష్మణ్ తెలిపారు. నిరుపేదనైన తనకు మెరుగైన వైద్యం, ప్రభుత్వం శాఖా పరంగా ఆదుకుని మేలు చేయాలని బాధితుడు మొరపెట్టుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు