గ్యాస్ లీక్...ఇంట్లో పేలిన సిలిండర్.!
25-09-2026 | 02:19pm
తప్పిన పెను ప్రమాదం.. ఒకరికి గాయాలు.
కల్వకుర్తి: కల్వకుర్తి మండలం రఘుపతిపేట పరిధిలోని రామగిరి గ్రామంలో గ్యాస్ సిలిండర్(Gas cylinder) పేలి ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మద్దిలేటి పెద్ద వీరయ్య ఇంట్లో గురువారం రాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
అయితే సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. సిలిండర్ పేలడంతో ఇంట్లోని తిండి గింజలు, బంగారు ఆభరణాలు, వస్తువులు, కొంత నగదు పూర్తిగా దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.