తృటిలో తప్పిన పెను ప్రమాదం..
- భారీ వర్షాలకు నేలకొరిగిన వృక్షం...
- విద్యుత్ లేక విలవిలాడిన 18 డివిజన్ ప్రజలు....
- సహాయక చర్యలు చేపట్టిన కార్పొరేటర్ హిమశ్రీ..
కొత్తగూడెం సెప్టెంబర్ 25 విజయక్రాంతి :రామవరం పంజాబ్ గడ్డ పద్దెనిమిదో డివిజన్లో, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు, గురువారం రాత్రి 10:30 సమయంలో, భారీ వృక్షం చింత చెట్లు, కూలి కరెంటు స్తంభాలపై పడడంతో, విద్యుత్ అంతరయం ఏర్పడింది. నేలకు ఒరిగిన వృక్షాలతో, అర్ధరాత్రి స్థానికులకు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అవి పూర్తిగా విద్యుత్ స్తంభాలపై పడి స్థానికులకు రోజంతా కరెంటు లేక చిన్న పెద్ద అంతా విలవిల్లాడిపోయారు.
ఇట్టి విషయాన్ని తెలుసుకున్న 18 డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ,తక్షణమే చర్యలు చేపట్టి పూర్తిగా ఆ భారీ వృక్షాలను తొలగించి, విద్యుత్ అధికారులతో సంప్రదించి,18 డివిజన్ ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా సహాయ సహకారాలు అందించాలని అధికారులను కోరారు.
అడ్డుగా ఉన్న వృక్షాలను తొలగించి విద్యుత్తు పునరుద్ధరించి, ప్రజలకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచర్ల హేమాశ్రీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జమలయ్య, మాజీ కౌన్సిలర్ పాటిమోహన్రావు, సిపిఐ నాయకులు,మట్టపర్తి రమేష్,ఈశ్వరరావు, రాజేశ్వరరావు,ప్రసాద్, కుమార్ పాల్గొన్నారు.