బ్రేక్ తర్వాత బిగ్ కమ్‌బ్యాక్

25-09-2026 | 02:13pm

గాయం అతడిని ఆటకు దూరం చేసింది.. కానీ తిరిగి వచ్చినప్పుడు మరింత బలంగా కనిపించాలనే పట్టుదలను పెంచింది. టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ(Prasidh Krishna Fitness) ఇప్పుడు తన రీ-ఎంట్రీపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. గాయంతో ఆగిపోయిన స్థాయి కంటే పది రెట్లు మెరుగైన ప్రదర్శనతో తిరిగి రావాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రసిద్ధ్ చెప్పాడు. ముఖ్యంగా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో(India vs Australia Test Series) భారత్ ఆడనున్న ఐదు టెస్టుల సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో కీలకమైన ఈ సిరీస్‌కు ముందే తన రిథమ్, ఫిట్‌నెస్, బౌలింగ్‌పై పూర్తి స్థాయిలో పనిచేయాలని ప్రసిద్ధ్ భావిస్తున్నాడు. గాయం ఇచ్చిన బ్రేక్‌ను బలంగా తిరిగి రావడానికి ఉపయోగించుకోవాలన్నదే అతడి ప్లాన్. "గాయపడినప్పుడు నేను ఏ స్థాయికి చేరుకున్నానో, తిరిగి వచ్చినప్పుడు అంతకంటే పది రెట్లు మెరుగ్గా ఉండాలని నేను ఎప్పుడూ నాకు నేనే చెప్పుకుంటాను. ఆ దృక్పథం చాలా ముఖ్యం," అని భారత్ సుదీర్ఘ స్వదేశీ సిరీస్‌ల సీజన్‌కు ముందు ప్రసిధ్ మీడియాతో పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు