ఆ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఎందుకీ బ్రేక్?

25-09-2026 | 01:48pm

విజయ్ దేవరకొండ–సుకుమార్ కాంబినేషన్‌లో(Vijay Deverakonda Upcoming Movies) సినిమా వస్తుందని ఎప్పుడో అనౌన్స్‌మెంట్ వచ్చినా.. ఇప్పటివరకు ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. దీంతో ఈ క్రేజీ కాంబో పరిస్థితి ఏంటన్నది మరోసారి ఇండస్ట్రీలో చర్చగా మారింది. సుకుమార్ ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టగా.. విజయ్(Vijay Deverakonda Next Movie) కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘రణబాలి’ పూర్తి చేసిన విజయ్, ‘రౌడీ జనార్దన్’,(Rowdy Janardhana) శౌర్యువ్‌తో మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టుకున్నారు. ఇద్దరి కమిట్‌మెంట్లు వరుసగా ఉండటంతో విజయ్–సుకుమార్ మూవీ ఇప్పట్లో సెట్స్‌పైకి వచ్చే అవకాశం కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందా? లేక కేవలం వాయిదా పడిందా? అనే దానిపై మాత్రం అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు