గుంతల రోడ్డుపై నరకయాతన
బురద, నీటి గుంతలు
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
రాజరాజేశ్వరి కాలనీవాసుల అవస్థలు
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గండి మైసమ్మ ఎక్స్‌రోడ్ సమీపంలోని దొమ్మర పోచంపల్లి పరిధి రాజరాజేశ్వరి కాలనీ(Rajarajeshwari Colony)లో రహదారి అధ్వానంగా మా రింది. ఉజ్వల గ్రాండ్ హోటల్ వెనుక వైపు ఉన్న ఈ రోడ్డంతా గుంతలు, బురద, నిలిచిన వర్షపు నీటితో కాలనీవాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారి మొత్తం చిత్తడిగా మారుతోంది. గుంతల్లో నీరు నిలిచి వాటి లోతు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు.
పాద చారులు, చిన్నారులు, వృద్ధులు ఈ మార్గంలో నడవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అం బులెన్స్‌లు, ఇతర వాహనాలు కాలనీలోకి రావడం కూడా కష్టంగా మారింది. చుట్టుపక్కల భారీ భవనాలు, వ్యాపార సముదా యాలు వెలుస్తున్నప్పటికీ కాలనీకి కనీస రహదారి సౌకర్యం లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా ముందుగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, అ నంతరం నాణ్యమైన సీసీ లేదా బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే ఈ ప్రాంతాన్ని పరిశీలించాలని, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు స్పం దించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.