రైతుకు నష్టపరిహారం చెల్లించాలి

30-10-2026 | 06:50pm

అఖిలభారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నందిరామయ్య

ఖానాపూర్,(విజయక్రాంతి): ఎల్ నినో(El Nino) ప్రభావంతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరాకు 30 నుండి 50 వేల వరకు ఇవ్వాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం(All India United Farmers Association) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నందిరామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నిర్మల్ జిల్లా(Nirmal district) ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పంటల పరిస్థితి పరీక్షించారు. ఈ మేరకు ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ రాకపోవడం విడ్డూరమని అప్పుచేసి ఆరుగాలం కస్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో తెగులు సోకి నష్టపోయారని ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఎకరానికి వరికి 30000, పత్తి పంటకు 50,000 నష్టపరిహారం చెల్లించాలని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నవంబర్ రెండవ తారీఖున ఖానాపూర్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయనతో పాటు అడవి సారంగాపూర్ గ్రామ సర్పంచ్ మడావి అంకుష్రావు, మోహన్, శంకర్, బాజీరావు ,చందు, రాజేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు