శ్రీరామ రక్షా యజ్ఞం విజయవంతం చేయాలి
ముకరంపుర, అక్టోబర్ 30(విజయ క్రాంతి): లోక కల్యాణార్థం శ్రీనీలకంఠ భజన మండలి(Sri Neelakantha Bhajana Mandali) ఆధ్వర్యంలో నవంబర్ 1న సిరిసిల్ల బైపాస్ రోడ్ లోని దేవోక్షపురి శ్రీసీతారామ సహిత పంచముఖ హనుమదీశ్వర దేవాలయంలో నిర్వహించే శ్రీరామ రక్షా యజ్ఞం(Sri Rama Raksha Yajna) విజయవంతం చేయాలని అర్చకుడు కూర్రాచలం రామాచార్యులు, మండలి గౌరవాధ్యక్షుడు గర్రెపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు.
శుక్రవారం ఆలయంలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి గణపతి హవనం, సీతారాములకు విశేష అభిషేకం, గణపతి, నవగ్రహ, మృత్యుంజయ సహిత శ్రీరామ రక్షా యజ్ఞం ఉంటుందని తెలిపారు. యజ్ఞంలో పాల్గొనే దంపతులు ఆలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు.
ముందుగా దేశంలో ముద్రించిన భక్తులచే రాసిన, రాయించిన 10 కోట్ల శ్రీరామ కోటి నామ లిఖిత పుస్తకాలను ఆలయంలోని శ్రీరామ స్థూపంలో సమర్పించడం జరుగుతుందని అన్నారు. పూర్ణాహుతి అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు. ఈ సమావేశంలో మండలి అధ్యక్షుడు పంజాల శ్రీధర్ గౌడ్, పీచర నరేందర్ రావు, జోగినపల్లి భగవంతరావు, కటకం చంద్రయ్య, ఆలయ అర్చకుడు కంకణాల భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.