ఆయుష్ శాఖలో ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
30-10-2026 | 08:10pm
నవంబర్ 3న మల్టీపర్పస్ వర్కర్ రాత పరీక్ష
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జాతీయ ఆయుష్ మిషన్(National AYUSH Mission) పరిధిలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత(District Collector K. Haritha) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మల్టీపర్పస్ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 3న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులందరూ సకాలంలో పరీక్షకు హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.