వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోండి

18-09-2026 | 08:17pm

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్

ఖానాపూర్( విజయక్రాంతి): వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని అందుకు కావలసిన ఏర్పాట్లు అన్ని మున్సిపాలిటీ (Municipality) తరఫున చేస్తున్నామని ఖానాపూర్ మున్సిపాలిటీ (Khanapur Municipality) చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో నిమజ్జనానికి కావాల్సిన వీధిలైట్లు ,రోడ్లు గుంతల పూడిక, గోదావరి నది వద్ద కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తున్నామని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షోయబ్, కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, బండి పల్లి సింధుజ, గుమ్ముల అశోక్, తొడసం ఇందిరా, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ,తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు