4 September, 2026 | 8:53 PM

కాంగ్రెస్ పార్టీ సంబరాలు

04-09-2026 | 07:46pm

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం లక్ష్మణ చందా మండల(Lakshmana Chanda Mandal) కేంద్రంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. మండల పార్టీ కన్వీనర్ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి అధ్యక్షులు రఘునందన్ రెడ్డి, మార్కెట్ కమిటీ  చైర్మన్ భీమ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.