4 September, 2026 | 8:47 PM

కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీ మహిళా వ్యతిరేక పార్టీగా నిరూపించుకుంది

04-09-2026 | 07:34pm

మాజి సర్పంచ్ లు గణేష్ నేత చిట్టిమిల్ల, రాగజ్యోతి నేత చిట్టిమిల్ల

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) బిసి మహిళా వ్యతిరేక పార్టీగా మరోసారి నిరూపించుకుందని మునిరాబాద్ గ్రామ మాజి సర్పంచ్ లు మేడ్చల్ జిల్లా పద్మశాలి సంఘం(Padmashali Sangam) నేతలు గణేష్ నేత చిట్టిమిల్ల, రాగజ్యోతి నేత చిట్టిమిల్లలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక బిసి మహిళా బిడ్డని అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకు నుంచి బర్తరఫ్ చేయడం దుర్మార్గమైన చర్యని వాపోయారు. కూతురు ఏదో మాట్లాడిందని తల్లిని శిక్షించడం అత్యంత దారుణమైన చర్యని వారు తెలిపారు.

గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Chief Minister Revanth Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక మాటలు మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డిలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా కేవలం కూతురేదో మాట్లాడిందని కొండా సురేఖని రాష్ట్ర క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయడం సిగ్గుచేటని గణేష్, రాజ్యోతిలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల పార్టీగా మారిందని వారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి ఇక రోజులు దగ్గర పడ్డాయని వచ్చే ఎన్నికల్లో బీసీలు,మహిళలు తగిన బుద్ధి చెబుతారని వారు తెలియజేశారు. పద్మశాలి ఆడబిడ్డను అవమానించిన మీ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతుందని కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పద్మశాలిలంతా  పని చేస్తామని మాజి సర్పంచ్ గణేష్ నేత చిట్టిమిల్ల అన్నారు.