4 September, 2026 | 7:30 PM

అవయవ దానంతోనే అమరత్వం!

13-08-2026 | 12:00am

నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల లక్షల మంది పలు అవయవాలు సక్రమంగా పనిచేయక అకా ల మరణం చెందుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యం, ప్రమాదాలు, వైరస్ ప్రభావాలు, చెడు అలవాట్లు, శారీరక రుగ్మతల కారణంగా అవయవాల పనితీరు మందగించి మరణించడం, వారి కుటుంబ సభ్యు లను శోకసంద్రంలో ముంచడాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే, వీటిలో కొన్ని మరణాలను మన దాతృత్వం ద్వారా నిలువరించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం బతికే ఉండగానే, కొన్ని అవయవా లు దానం చేయడం ద్వారా ఎందరినో బతికించగలం. ఈ విషయంపై అవగాహన కల్పించే సదుద్దేశంతో ఏటా ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకొంటారు.

ప్రపంచంలో తొలిసారిగా 1954లో రోనాల్డ్ లీ హెరిక్ తన సోదరుడికి కిడ్నీ ఇ చ్చారు. ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ డాక్టర్ జోసెఫ్ ముర్రే ఆధ్వర్యంలో విజయవంతమైంది. ఆ తర్వాత 1967లో డాక్టర్ క్రిష్టి యన్ బెర్నార్డ్ ఆగస్టు 13న తొలిసారి గుం డె మార్పిడి ఆపరేషన్ జయప్రదంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని గుర్తుచేసు కుంటూ ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని  ఏటా నిర్వహిస్తున్నా రు. అయితే మన దేశంలో 1994 ఆగస్టు 3న మొట్టమొదటి గుండె మార్పిడి ఆపరేషన్ జయప్రదంగా జరిగింది. ఆ రోజును స్మరించుకుంటూ ఆగస్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మరణాంతరం అవయవదానం చేసే వారిలో స్పెయిన్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. తదుపరి స్థానంలో అమెరికా, పోర్చుగీసు ఉన్నాయి. స్పెయిన్‌లో మరణించే ప్రతీ లక్ష మందిలో 47 మంది అవయవదానం చేస్తుండగా, అమెరికాలో 44.5 మంది, పోర్చుగీస్‌లో 31.5 మంది, ఫ్రాన్స్‌లో 25.8 మంది, బ్రిటన్‌లో 20.6 మంది, జర్మనీలో 10.4, టర్కీలో 3.4, సౌదీ అరేబియాలో 3.3 మంది అవయవదానం చేస్తున్నారు.

కానీ, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉనన మన దేశంలో మాత్రం కేవలం 0.8 మంది అవయవదానం చేయడం గమనార్హం. అదే సమ యంలో అకస్మాత్తుగా మరణించే సందర్భంలో అవయవదానం చేయడంలో కొ లంబియాలో 75 శాతంతో ముందు వరుసలో ఉండగా, మనదేశం 74 శాతంతో ద్వి తీయ స్థానంలో ఉండటం విశేషం. ఈ విషయంలో 72 శాతంతో స్పెయిన్ తృతీయ స్థానంలో ఉంది. బతికి ఉండగా తమ అవయవాలను దానం చేయడంలో టర్కీ, దక్షి ణ కొరియా, నెదర్లాండ్స్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. అదే సమయంలో అవయవాలు తీసుకుంటున్న వారిలో ముందు వరుసలో స్పెయిన్, క్రొయేషి యా, అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉన్నట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి.

ఒక వ్యక్తి బతికి ఉండగా ఒక కిడ్నీ, కాలేయంలో కొంత భాగం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్ ఇవ్వవచ్చు. ఇక మరణాంతరం (లేదా) బ్రెయిన్ డెడ్ సందర్భంగా రెండు కిడ్నీలు, కార్నియా, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, గుండె అవయవదానం చేయవ చ్చు. ఇక చర్మం, గుండె కవాలాలు, ఎముకలు, టిష్యూలు వంటివి దానం చేయడం ద్వారా కొంతమందిని బతికించగలమనే విషయాన్ని మరువరాదు.

అవయవదానానికి వయస్సుతో నిమిత్తం లేదు. కేవలం ఆరోగ్య పరిస్థితి, అవయవ పనితీరుపైనే అవయవ దానం ఆధారపడి ఉంటుంది. అయితే ముందస్తుగా అవయవదానం చేసే వ్యక్తి తన పేరును నమోదు చేసుకోవాలి. తన కుటుంబ సభ్యులకు ఈ విష యాన్ని తెలియజేయాలి. మన దేశంలో ఈ కార్యక్రమం అధికారికంగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ చేపడుతుంది. తెలంగాణ, ఏపీలో జీవన్‌దాన్ పేరుతో జరుగుతుంది.

మన దేశంలో ఏటా 1.50 లక్షల మందికి కిడ్నీలు అవసరం. కాగా, 5000 కిడ్నీలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ప్రతీ పదివేల మందిలో ఒక్కరికే కార్నియా లభ్యమవుతున్నది. అలాగే ప్రతీ పదివేల మందిలో 2.3% మాత్రమే కాలేయం దొరుకుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతీ వంద మంది అవయవాలు కావలసినవారిలో 86% మందికి కిడ్నీలు, 9% మందికి కాలేయం, 1.1% మందికి పాంక్రియాస్, 3% మందికి గుండె, 1% మందికి ఊపిరితిత్తులు, 2% ఇతర అవయవాలు కావలసిన ఉంది. అయితే మన దేశంలో అవయవదానం చేయడంలో మహిళలు ముందువరుసలో ఉన్నారు. అవయవ గ్రహీతల్లో పురుషులు అధికంగా ఉన్నారు.

మరణాంతరం అవయ వదానం చేయడంలో అత్యధికంగా తమిళనాడులో 266 మంది, తెలంగాణలో 205 మంది, కర్ణాటకలో 199 మంది ఉన్నారని తెలుస్తోంది. అవయవాలు దొరక్క ప్రతీ రోజూ 17 మంది అకాల మరణం చెందుతుండటం బాధాకరం. 2018 నాటికే మన దేశంలో 15 లక్షల మందికి వివిధ అవయవాలు అవసరం ఉందని వెయిటింగ్ లిస్టు లో ఉన్నారు. వారిలో ఎక్కువగా కార్ని యా, కిడ్నీలు కావలసిన వారే. ఒక వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా 8 మందిని కాపాడవచ్చు. తన టి ష్యూలు ద్వారా పదుల సంఖ్యలో ప్రాణా లు కాపాడవచ్చు.

ప్రతీ సంవత్సరం ఒక్క అమెరికాలోనే వివిధ అవయవాల కోసం 1,03,200 మంది వెయిటింగ్ లిస్టులో ఉండగా, సరై న సమయంలో లభ్యం కాక 5600 మంది మరణిస్తున్నారు. ఇక మన దేశం లో ఏటా 5 లక్షలు మందికి వివిధ అవయవాలు అవసరం పడుతున్నది. 

గతంలో అవయవ మార్పిడి ఆపరేషన్ కోసం ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితి ఉం డేది. కానీ నేడు మన దేశంలోనే అవయవ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. 2025లో రికార్డు స్థాయిలో 20,138 అవయవ మార్పిడి ఆపరేషన్లను దిగ్విజయంగా మన వైద్యులు పూర్తి చేయడాన్ని అభినందించాల్సిందే. వీటిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు 14,477, కాలేయం 5164, గుండె 239, ఊపిరితిత్తులు 210, పాంక్రియాస్ 35 ఉన్నాయి. అవయవ మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా చేయడంలో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉండటం విశేషం. అదే విధంగా ప్రపంచంలోనే లివింగ్ డోనార్ ట్రాన్స్‌ఫ్లాంట్‌లో మొదటి స్థానంలో నిలిచింది.

మన దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1,74,000 మంది మరణిస్తున్నారు. అకాల మరణం చెందిన వారి అవయవాలను సరైన సమయంలో సేకరించి ఎందరికో పునర్జన్మ ఇవ్వవచ్చు. మరణించినా ఈ భూమిపై సజీవంగానే ఉండవచ్చనే వాస్తవాన్ని గ్రహించి, అంద రూ అవయవదానం చేయడానికి ముందుకురావాల్సిన అవసరం ఉంది.

వ్యాసకర్త సెల్: 8374844618

ఐ.ప్రసాదరావు