4 September, 2026 | 11:09 AM

హెచ్‌సీఏకు హైకోర్టులో ఎదురుదెబ్బ

04-09-2026 | 05:45am

యథాతథంగా బీసీసీఐ అంబుడ్స్మన్ విచారణ

సింగిల్ జడ్జి మధ్యంతర స్టే ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే

నిబంధనలకు ఎవరూ అతీతులు కాదన్న టీసీఏ 

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీసీసీఐ(BCCI) అంబుడ్స్మన్ విచారణ అంశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(Hyderabad Cricket Association)కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

బీసీసీఐ అంబుడ్స్మన్, మాజీ న్యాయమూర్తి జస్టి స్ (రిటైర్డ్) అరుణ్ మిశ్రా ఎదుట కొనసాగుతున్న విచారణను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యం తర ఉత్తర్వుపై తెలంగాణ హై కోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఆగస్టు 14న సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు న్యా య వాది అదిత్య కుమార్ చౌధరి చేపట్టిన న్యా యపోరాటం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

చీఫ్ జస్టిస్ అపరేష్ కుమా ర్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్లతో కూడిన డివిజన్ బెం చ్, బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్స్ 40, 41 కింద ఏర్పాటైన వివా ద పరిష్కార వ్యవస్థల ప్రాముఖ్య తను పునరుద్ధరిస్తూ విచారణ కొ నసాగేందుకు మార్గం సుగమం చేసింది. ప్రా థమికంగా తమ ఫిర్యాదులను లేవనెత్తి, పరిపాలనలోని లోపాలను వెలుగులోకి తీసుకువచ్చిన క్రికెటర్లు గౌర వ్ శర్మ, నవరసన్ ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిపాలనకు సంబంధించిన దీర్ఘకాలిక వివాదంలో సంస్థాగత జ వాబుదారీతనం, నిబంధనల అమలుకు ఈ తీర్పు కీలక విజయంగా నిలిచిందనీ పేర్కొన్నారు.

తెలంగాణ క్రికెట్‌కు స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థ అవసరమనీ, ఇప్పుడు అంబుడ్స్మన్ ఈ లోపాలను స్వతంత్రంగా పరిశీలించి, వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని చె ప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణ క్రికెట్ అ సోసియేషన్  జనరల్ సెక్రట రీ ధర్మ గురువా రెడ్డి ఈ తీర్పును స్వాగతిస్తూ, ఇది పరిపాలనా అహంకారానికి గట్టి ఎదురుదెబ్బ అని పేర్కొ న్నారు. ఏ సంస్థ కూడా నిబంధనలకు అతీతంగా వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ క్రికెట్ ఇకపై పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన వ్యవ స్థలో ముందుకు సాగాల్సిన సమయం వ చ్చిందని వ్యాఖ్యానించారు.