గురుకులంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

11-09-2026 | 07:17pm

వనపర్తి  ( విజయక్రాంతి ) :  ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వినోద్‌ కుమార్‌ సూచించారు. శుక్రవారం వనపర్తి మండలం చిట్యాల గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే(Mahatma Jyotiba Phule) బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల నమోదు, స్టాక్‌ రిజిస్టర్లు, భోజన నిర్వహణను పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడి చదువు, భోజనం, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాన్ని బోధించి వారి అవగాహనను పరీక్షించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళికతో బోధన చేపట్టాలని, విద్యార్థులకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు.

మరిన్ని వార్తలు