బీఆర్ఎస్ పార్టీని దళిత నేతలు వీడాలి

11-09-2026 | 06:25pm

బోథ్,(విజయక్రాంతి): దళిత స్పీకర్ను అవమానించిన బిఆర్ఎస్ పార్టీ(BRS party) నాయకుల వైఖరి వల్ల దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడి గజేందర్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటిలు విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు వెళ్లిన రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేయడం మనువాద దుర అహంకారమవుతుందన్నారు. ఇప్పటికైనా బిఅరస్ పార్టీలో ఉన్న దళిత నేతలు పార్టీని విడిచి పెట్టాలన్నారు. భవిష్యత్తులో దళితులు బి ఆర్ ఎస్ పార్టీ పైన పోరాటం చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు