గణేష్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి : కాటారం డీఎస్పీ

11-09-2026 | 07:14pm

మహాముత్తారం, సెప్టెంబర్ 11 ( విజయక్రాంతి ) : అడవిముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పలు జాగ్రత్తలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ(DSP Suryanarayana) తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండప నిర్వాహకులు ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను సక్రమంగా సంబంధిత ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రతి గణేష్ మండపం వద్ద సైబర్ మోసాలపై అవగాహనకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.

ఓటీపి, ఏటీఎం పిన్, సీవీవీ పాస్ వర్డ్ ఎవరికి చెప్పకూడదని, తెలియని లింకులను ఓపెన్ చేయకూడదని, అనుమానాస్పద యాప్ లను డౌన్లోడ్ చేయకూడదని, తెలియని వ్యక్తులతో స్క్రీన్ షేరింగ్ చేయకూడదని, యూపీఐ ద్వారా డబ్బు స్వీకరించడానికి పిన్ అవసరం లేదని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కు కాల్ చేయాలని లేదా Cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలని తదితర విషయాలు ఉండేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.

మరిన్ని వార్తలు