రష్యా డేటా హబ్‌పై ఉక్రెయిన్ దాడి

12-10-2026 | 05:10am
  1. మాస్కో టెక్నాలజీ దిగ్గజం యాండెక్స్ మూత
  2. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు కావాలి:ట్రంప్
  3. తమ దేశంలో యుద్ధానికి రష్యానే బాధ్యత వహించాలి 
  4. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ 

కీవ్, అక్టోబర్ 11: రష్యా డేటా హబ్‌పై(Russian data hub) ఆదివారం ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో మాస్కో టెక్నాలజీ(Moscow Technology) దిగ్గజం అయిన యాండెక్స్ డేటా సెంటర్ మూతపడింది. తమ దేశంలో జరుగుతున్న యుద్ధానికి రష్యా మాత్రమే బాధ్యత వహించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం సవాల్ విసిరారు.

అధిక డీజిల్ ధరలకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై నిందలు వేస్తున్నారని ఆగ్రహించారు. మాస్కో ఉక్రెయిన్ ఇంధన గ్రిడ్‌పై దాడులు ఆపితే, తాము కూడా రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులను నిలిపివేస్తుందని ఆయన అన్నారు.

ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వాఖ్యలు చేసిన అనంతరం జెలెన్‌స్కీ తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. రష్యాలోని మౌలిక సదుపాయాలపై కీవ్ తన దాడులను తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ వాగ్వాదం జరిగింది. ఆదివారం జరిగిన ఒక డ్రోన్ దాడిలో రష్యా టెక్నాలజీ దిగ్గజం యాండెక్స్ నడుపుతున్న డేటా సెంటర్ మూతపడింది.

నాలుగు రోజుల్లో ఆ సంస్థ సౌకర్యాలపై ఇది మూడవ దాడని పేర్కొంది. ఒక డేటా సెంటర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడితో మూసివేసినట్లు యాండెక్స్ సంస్థ తెలిపింది. నాలుగు రోజుల్లో తమ సంస్థలపై ఇది మూడోదని పేర్కొంది. తరచుగా రష్యా గూగుల్‌గా వర్ణించబడే యాండెక్స్, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్. విస్తృత శ్రేణి డిజిటల్ సేవలను నిర్వహిస్తుంది.

రష్యా కృత్రిమ మేధ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ‘రష్యా మా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపితే, రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు ఆపడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉంటుంది’ అని జెలెన్‌స్కీ ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా తిప్పికొట్టారు.

శనివారం రాత్రి ఎక్స్‌లో రాస్తూ, జెలెన్‌స్కీ దేశాన్ని దాని స్వాతంత్య్రం కోసం జరుగుతున్న యుద్ధంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. విదేశాల నుండి వస్తున్న ప్రకటనలు ఆయన తన పనిని సక్రమంగా చేస్తున్నారని మాత్రమే ధ్రువీకరిస్తున్నాయని స్పష్టం చేశారు. మరో పక్క ఉక్రెయిన్‌లోని దక్షిణ నగరమైన జపోరిజ్జియాలో శనివారం రష్యా జరిపిన బాంబు దాడిలో నలుగురు పిల్లలతో సహా మొత్తం 23 మంది మరణించారని జెలెన్‌స్కీ తెలిపారు. 30 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు