హనుమాన్‌ దీక్షలో కొండగట్టుకు వరుణ్‌తేజ్‌

27-09-2026 | 02:46pm

మల్యాల, సెప్టెంబర్ 27, (విజయక్రాంతి): మల్యాల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని సినీ హీరో వరుణ్‌తేజ్‌ ఆదివారం దర్శించుకున్నారు. హనుమాన్‌ దీక్షలో ఉన్న ఆయన ఆలయానికి చేరుకోగా అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు. ఆయన వెంట కమెడియన్‌ సత్య ఉన్నారు. వరుణ్‌తేజ్‌ను చూసేందుకు అభిమానులు తరలిరావడంతో ఆలయంలో కొద్దిసేపు రద్దీ నెలకొంది.

మరిన్ని వార్తలు